కళ్ళల్లో ఒక వెన్నల....(సీరియల్) (PART-4)
తల్లి ఒడిలో
తల పెట్టుకుని
ఏడుస్తున్నది వైష్ణవీ.
కూతురి తల
మీద చేయిపెట్టి
ఓదారుస్తోంది తల్లి
మేనకా.
“వైష్ణవీ!
ఏమిటమ్మా ఇది...పసిపిల్లలాగా?”
“కుదరటంలేదమ్మా!
ఆ పసిబిడ్డ
ఏడుపును నేను
మరిచిపోలేకపోతున్నాను.
ఇంకా నా
చెవిలో ఆ
ఏడుపు శబ్ధం
వినబడుతూనే ఉంది”
“ఆ
బిడ్డకు అలా
రాసిపెట్టాడు దేవుడు.
మనం ఏం
చేయగలం?”
“అవన్నీ
మనుషులు చేసిన
తప్పమ్మా. దీన్ని
దేవుడి మీద
నెపంగా వేయకూడదు”
“సరే, ఆ
అమ్మాయికి ఏం
కష్టమో? ఎలాంటి
పరిస్థితిలో కన్నదో...?”
“ఎలాంటి
పరిస్థితి అయితే
ఏంటమ్మా? కన్న
బిడ్డను ఇలా
అనాధలాగ పడేసి
వెళ్ళటానికి ఆమెకు
మనసెలా వచ్చింది...ఇది
పాపం కాదా?”
వైష్ణవీ పక్కనే కూర్చున్న
సరోజా అందుకుంది.
“పాపమే అక్కా!
రోజూ ఇలాంటి
పాప కార్యాలు
జరుగుతున్నాయి
కాబట్టే అక్కడక్కడ
సునామీలూ, భూకంపాలూ
వస్తున్నాయి. దీనికంతా
ఏడిస్తే రోజూ
ఏడుస్తూ ఉండాల్సిందే”
“నా
మనసు చల్లబడలేదు
సరోజా! ఇప్పుడు
తలచుకుంటే కూడా...”
“తలచుకోకు
అక్కా! హాస్పిటల్
సమస్యను అక్కడే
వదిలేసి ఇంటికి
రా. లేకపోతే
ప్రశాంతత పోతుంది”
“ఇందుకే
ఈ నర్స్
ఉద్యోగమే వద్దని
చెప్పాను. నువ్వే
‘సేవ
చేసే పని.
ఇందులో దొరికే
హాయి, మనశ్శాంతీ
వెరే దేంట్లోనూ
దొరకదు’ అని
చెప్పి,
పట్టుబట్టి చేరావు”
“ఇప్పుడు
చూడు! నెలలో
పదిరోజులు ఇలా
ఏదో ఒక
కేసు గురించి
ఏడుస్తూ, తినకుండా
పస్తుంటావు. వైషూ!
మెత్తని మనసు
ఉండొచ్చు. ఇలా
అన్నిటికీ ఏడవకూడదురా”
“సారీమ్మా!
నేనూ ధైర్యంగానే
ఉన్నాను. కొన్ని
సమయాలలో నాకే
తెలియకుండా...”
“ఏమక్కా!
ఈ నర్సు
ఉద్యోగానికే నువ్వు
ఇలా అయితే, నువ్వొక
డాక్టర్ గానో...పోలీసుగానో
అయ్యుంటే ఏం
జరుగుంటుందో?” సరోజా
ఎగతాలిగా అడగగా, గబుక్కున
లేచి కూర్చుంది
వైష్ణవీ.
“ఏం?”
“ఎందుకా? ప్రతి
రోజూ ఎన్నో
ప్రమాదాలూ, హత్యలూ, దోపిడీలూ
అంటూ ఎంతో
రక్తం చూడవలసి
వస్తుంది? దానికంతా
ఎంత మనోబలం కావాలో
తెలుసా?”
వైష్ణవీకి అనుకోకుండా
అశ్విన్ జ్ఞాపకం
వచ్చింది. అతనూ
బిడ్డను చూసి
బాధపడ్డాడు. అది
అతని మొహంలో
క్లియర్ గా
కనబడింది. కానీ, అతను తనలాగా
ఏడవలేదే! అతి
సులభంగా మనసును
దృఢ పరుచుకుని, డ్యూటీ
బాధ్యతలో దిగిపోయాడే...
‘అదేనా
ధైర్యం? అది
నా దగ్గర
లేదా? అతనికి
ఇలాంటి కన్నీరు, నష్టము
అలవాటు అయిపోయుండచ్చు.
నేనూ అలవాటు
చేసుకోవలసిందే!
దీనికొసం భయపడి
నేను ఏడ్చి
-- అమ్మను బాధపెట్టించవచ్చా? అన్నిటినీ
ధైర్యంగా ఎదుర్కోవద్దా?’ -- కళ్ళు
తుడుచుకుంది.
“ఏమ్మా...డిన్నర్
కు వస్తావా?”
“నువెళ్ళమ్మా!
నేను మొహం
కడుక్కుని వస్తాను”
“సరోజా...నువ్వురా!
అందరూ తినేస్తే, నా
పని పూర్తవుతుంది”
“ఇదిగో
వస్తున్నానమ్మా” అన్న వెంటనే, కూతురి
గదిలో నుండి
బయటకు వచ్చింది
మేనకా. హాలులో
కూర్చుని టీవీలో
న్యూస్ చూస్తున్న
చక్రవర్తి, భార్యను
చూసిన వెంటనే
సౌండ్ తగ్గించారు.
“ఏం
చెబుతోంది నీ
కూతురు?”
“ఎప్పుడూ
జరిగేదే. ఎవత్తో
ఒకత్తి ఆడపిల్లను
కని అలాగే
పడేసి వెళ్ళిపోయిందట.
అది తలుచుకుని
ఇది ఒకటే
ఏడుపు”
“హు!
దీనికి ఎప్పుడు
మనసు దృఢ
పడుతుందో?”
“నేనొకటి
చెబితే వింటారా?”
“ఏమిటి?”
“దానికి
ఒక వరుడ్ని
చూడండి”
“ఏమిటి...పెళ్ళి
చేసేద్దాం అంటావా?”
“అవును...దానికి
వయసు ఇరవై
ఐదు అవుతోందే!
ఇప్పుడు చూస్తేనే
కదా సరిగ్గా
ఉంటుంది. దాని
తరువాత సరోజా
పెళ్ళీడుకు వస్తుంది.
ఎన్ని రోజులు
ఆడపిల్లలను ఇంట్లోనే
పెట్టుకోగలం”
“సరే
చూద్దాం”
“త్వరగా
చూడండి! లేకపోతే
ఇది ప్రతి
విషయాన్నీ చూసి, బాధపడి, ఒళ్ళు
పాడుచేసుకుంటుంది.
ఇప్పటికే మనసులోనూ, శరీరంలోనూ
బలం లేదు.
పిరికి పిల్లలా
తయారయ్యింది”
“సరి, సరి!
నేను, నాకు
తెలిసిన చోట్లలో
చెప్పి ఉంచుతాను.
దానికి నువ్వు
కొంచం బలమైన
ఆహారం పెట్టి
ఒళ్ళు సరిచెయ్యి”
“సరేనండీ!
టీ.వీ
ఆపేసి రండి.
డిన్నర్ చేద్దురుగాని”
“తీసిపెట్టు.
వస్తాను" అన్నప్పుడు
ముఖం తుడుచుకుంటూ
వచ్చింది వైష్ణవీ.
“వైషూ!
ఇలారా అమ్మాయ్”
“ఏం
నాన్నా?”
“ఏంటమ్మా
ఇది? ఎందుకు
ఇలా ప్రతి
విషయానికీ బాధపడుతూ
నీ ఒళ్ళు
పాడుచేసుకుంటున్నావు?”
“సారీ
నాన్నా”
“మనసు
ధైర్యంగా పెట్టుకోమ్మా.
జీవితంలో ఇంకా
ఎన్నో ఉన్నాయి!
వాటన్నిటినీ ఎదుర్కోవద్దా?”
“సరే
నాన్నా”
“నీకు
ఈ ఉద్యోగం
నచ్చలేదామ్మా?”
“అయ్యో!
నచ్చింది నాన్నా.
పూర్తి మనసుతోనే
ఇది చేస్తున్నాను”
“మరెందుకు
ఇంతలా క్షోబపడుతున్నావు?”
“నేనూ
మనిషే కదా
నాన్నా! ఎంతోమంది
పేషంట్లను చూస్తున్నాను.
వాళ్ళు నొప్పితో
కష్టపడుతున్నప్పుడు, నా
మనసు బాధపడుతోంది.
కానీ, పసిపాప
గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు...నన్ను
నేను కంట్రోల్
చేసుకోలేకపోయాను”
“దాని
ఏడుపును దాంతో
మాట్లాడి సరిచేశాము
కదా. మీరెందుకు
మళ్ళీ ప్రారంభిస్తున్నారు?” -- భర్తను
మేనకా ముద్దుగా
ఖండించటంతో ఆ
మాటలు ముగింపుకు
వచ్చినై.
మరుసటి రోజు
పొద్దున ఉత్సాహంగా
తయారై, తండ్రి
యొక్క టీ
వీలర్లో వెళ్ళి
ఆసుపత్రి వాకిట్లో
దిగినప్పుడు...పోలీసు
వాహనం నిలబడుంది.
మనసులో అలజడి
మొదలవగా, నాన్నకు
చెయ్యి ఊపి
‘బై’ చెప్పి
లోపలకు వస్తున్నప్పుడు...ఎదురుగా
యూనీఫారంలో గంభీరంగా
వచ్చాడు అశ్విన్.
ఆ డ్రస్సు
ఖచ్చితంగా అతనికి
సూటయ్యింది. అది
అతన్ని ఇంకొంచం
గంభీరంగా చూపించింది.
అతను తిన్నగా
తనవైపు రావడంతో
అయిష్టంగానే నవ్వింది.
“గుడ్
మార్నింగ్ సార్”
“వెరి
గుడ్ మార్నింగ్” --అతను
నవ్వాడు.
“ఏమిటి
సార్...పొద్దున్నే
ఇంత దూరం?”
“ఒక
చిన్న ఎంక్వయరీ”
“దేని
గురించి?”
“నిన్న
జరిగిన సంఘటన
గురించి...”
“సార్!
ఆ అమ్మాయిని
కనిపెట్టేసారా?”
“లేదు!
ఆసుపత్రిలో ఆ
అమ్మాయి ఇచ్చిన
అడ్రస్సు ఫేక్.
పేరుకూడా నిజమైన
పేరుగా ఉంటుందని
నమ్మకం లేదు”
“అప్పుడు
ఆ బిడ్డ?”
“అది
జాగ్రత్తగా ఉంది.
ఏమీ సమస్య
లేదు”
ఆమె మౌనం
అయ్యింది.
“మిస్.
వైష్ణవీ!”
“సార్”
“మిమ్మల్ని
చూస్తుంటే గర్వంగా
ఉంది”
“ఎందుకు
సార్?”
“ఇంకొకరి
కోసం కన్నీరు
చిందటం పెద్ద
విషయం. అపూర్వం
కూడా. కానీ...!”
“కానీ...”
“మనసును
ఇంత మెత్తగా
పెట్టుకోకండి. ఎప్పుడూ
ధైర్యంగా ఉండాలి.
ముఖ్యంగా మీలాంటి
ఆడవాళ్ళు మరికొంచం
ఎక్కువ ధైర్యంగా
ఉండాలి”
“ఊ...”
“ఇది
సలహా అని
అనుకోండి. మీ
మీద శ్రద్ధగా
తీసుకోండి” -- అన్న
అతన్ని ఆశ్చర్యంతోనూ, బిడియంతోనూ
చూసింది.
“తప్పుగా
అర్ధం చేసుకోకండి.
నిన్న మీరు
అంతగా ఏడవటం
కష్టం అనిపించింది”
“అది...నేను...”
“సరి.
నాకు అర్ధమవుతోంది.
మీ ఉద్యోగానికి
ఈ దయాగుణం, జాలిగుణం
అవసరమే. అదేలాగా
మనో దృఢం
కూడా కావాలి”
“సరే
సార్...నాకు
పనికి టైమవుతోంది”
“ఓ.కే.
వెళ్ళిరండి...నేనూ
బయలుదేరతాను” -- అతను
బయటకు వెళ్ళగా, సన్నటి
నవ్వుతో ఆసుపత్రి
లోపలకు వెళ్ళింది.
ఎప్పుడూ చేసే
పనే. అయినప్పటికీ
ఒళ్ళూ, మనసూ
బాగా ఉత్సాహంగా
వుంది. ఆ
ఉత్సాహం ముఖంలో
కనబడ, సంధ్యా
నవ్వుతూ అడిగింది.
“ఏం
సిస్టర్ చాలా
సంతోషంగా ఉన్నారు
లాగింది?”
“లే...లేదే!”
“ముఖమంతా
ఇంత ప్రకాశవంతంగా
ఉందే?”
“అలాగా?”
“ఎవరు
మ్యాడం ఆయన?”
“ఎ...ఎవరు?”
“అదే...మిలటరీ
స్టిఫ్ నెస్
తో ఒకాయన
వచ్చి వెళ్ళేరే!
ఈ ఏరియా
ఇన్స్పెక్టరట”
“అలాగా...నేను
చూడలేదే! నాకు
తెలియదు”
“కానీ, ఆయన
మీ గురించి
అడిగారే?” అన్న
ఆమెను ఆశ్చర్యంతో
చూసింది.
“నన్ను...నా
గురించి అడిగారా?”
“ఊ”
“ఏమడిగారు?”
“వైష్ణవీ
రాలేదా అని
హక్కుగా అడిగారు
సిస్టర్”
“అదా!
అది... నిన్న ఒక
పేషంటు, బిడ్డను
వదిలిపెట్టి వెళ్ళిపోయిందిగా.
దాని గురించి
ఎంక్వయరీకి వచ్చుంటారు”
“దాని
గురించి కూడా
విచారించారు. కానీ
మిమ్మల్నే ఎక్కువసేపు
వెతికారు. నేను
కూడా మీకు
తెలిసినాయన అని
అనుకున్నాను”
“అదంతా
ఏమీ లేదు”
“మనిషి...హీరోలాగా
సూపర్ గా
ఉన్నారు సిస్టర్...మీరు
కూడా చూసారు”
“నేనా.
ఎప్పుడు?”
‘బయట
నిలబడి మాట్లాడటాన్నిచూసుంటుందో?’
“అదే...పోయిన
వారం మీ
పుట్టిన రోజున
ఆలస్యంగా వచ్చారు!
నేను కూడా, ‘ఆయన
కాలుకు గాయం
ఏర్పడ్డది. కట్టు
వేయండీ’ అని చెప్పను?”
ప్రశాంతంగా శ్వాస
వదిలింది. “ఓ!
ఆయనా?”
“ఆయనే!
ఆ రోజు
మఫ్టీలో వచ్చారు.
ఈ రోజు
కాకీ బట్టలతో
‘టిప్
టాపు’ గా
ఉన్నారు”
“సరి...సరి!
నువ్వు ఇంటికి
వెళ్ళద్దూ? ఛీఫ్
డాక్టర్ వస్తే
‘నైట్
డ్యూటీ’ చూసేవాళ్ళకు
ఇంకా ఇక్కడ
ఏమిటి పని
అని అడుగుతారు.
బయలుదేరు”
“అవును!
ఆయన వచ్చేలోపు
వెళ్ళిపోవాలి. లేకపోతే...అప్పడంలా
వేయించేస్తారు.
బై...సిస్టర్”
“బై” -- నవ్వుతో
వైష్ణవీ తల
ఊప, సంధ్యా
తన బ్యాగును
తీసుకుని బయలుదేరింది.
ఒంటరిగా విడిచి
పెట్టటంతో, అశ్విన్
జ్ఞాపకం వచ్చింది.
“మిమ్మల్నే
ఎక్కువసేపు వెతికారు” అనే మాటలు
చెవులో ఎకోలాగా
వినిపించగా, తనలో
తాను నవ్వుకుంది.
Continued...PART-5
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి