31, మార్చి 2023, శుక్రవారం

మరణం తరువాత జీవితం...(ఆసక్తి)

 

                                                                                  మరణం తరువాత జీవితం                                                                                                                                                                     (ఆసక్తి)

ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనంలో మరణం తరువాత జీవితం గురించిన మొదటి సూచన దొరికిందని చెబుతున్నారు. వైద్య మరణం తరువాత మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో ఉంటాడు అనడానికి మొదటి సాక్ష్యం దొరికిందని వారు తెలియజేశారు. గతంలో ఇది అసాధ్యం అని భావించారు.

మరణం అనేది అనివార్య పరిణామం. కానీ శాస్త్రవేత్తలు మరణం తరువాత జీవితం ఉన్నదని చెప్పటానికి కావల్సిన సూచన దొరికిందని చెబుతున్నారు. అందువలన మరణం గురించిన బాధ అవసరం లేదని, ఎందుకంటే మరణం తరువాత ఇంకో జీవితానికి వెడతారనేది అర్ధం చేసుకోవలని తెలుపుతున్నారు.

ఒక వ్యక్తిలో మరణించిన తరువాత శరీరం వెలుపల ఏర్పడే అనుభవాల గురించి ఎప్పుడూ జరగనటువంటి అతిపెద్ద వైద్య అధ్యయనంలో  మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో, ప్రస్తుత లోకంలో ఉంటాడు అనే విషయాన్ని కనుగొన్నారు. మధ్య వరకు ఇది విస్తృత వివాదస్పద విషయంగా ఉండటంతో దీనిని (మరణం తరువాత జీవితం) విశ్వాసము లేని విషయంగానే పరిగణించారు.

కానీ సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ తో బాధపడుతున్న 2000 మంది రోగులను అమెరికా, ఇంగ్లాండ్ మరియూ ఆస్ట్రియా దేశాల 15 ఆసుపత్రులలో అధ్యయనం చేశారు. ఇందులో 40 శాతం మంది వైద్య పరంగా చనిపోయి డాక్టర్ల చేత గుండే ఒత్తిడి వైద్యముతో(కార్డియో పల్మనరీ రిసిపిటేషన్) బ్రతికి బట్ట కట్టారు. అందులో ఒక రోగి తాను తన శరీరం నుండి పూర్తిగా వెళ్ళిపోయి ఆసుపత్రి రూము చివరలో నిలబడి తన గుండెను డాక్టర్లు కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ చేస్తున్న దానిని చూసినట్లు గుర్తు చేసుకున్నాడు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మరణం తరువాత జీవితం...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి