23, మార్చి 2023, గురువారం

మంత్రాల బావి...(మిస్టరీ)


                                                                                     మంత్రాల బావి                                                                                                                                                                                 (మిస్టరీ) 

ఎస్టోనియా దేశంలోని తుహాలా అనే గ్రామంలో ఉన్నది మంత్రాల బావి.

ఎస్టోనియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర యూరప్ బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తరాన ఫిన్లాండ్, పశ్చిమాన స్వీడన్, దక్షిణాన లాట్వియా, తూర్పున రష్యా దేశాలు ఎల్లలుగా ఉన్నాయి.

తుహాలా అనే గ్రామంలో అత్యధికమైన భూగర్భ బావులు, నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహాలాలో ఉన్న ఒక బావి అత్యద్భుత ప్రకృతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్న బావి నుండి వర్షాకాలంలో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్తం ప్రాంతాన్ని వరదతో ముంచుతుంది. రెండు, మూడు సంవత్సరాలకో అలా జరుగుతుంది. కేవలం మూడు లేక నాలుగు రోజులు మాత్రమే అలా జరుగుతుంది. అందుకే బావిని మంత్రాల బావి అంటారు.

వారి కథ ప్రకారం ఇద్దరు మంత్రగాళ్లు భూమి కింద యుద్దం చేసుకోవటం వలనే ఇలా బావి నుండి నీరు వచ్చి వరదగా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడు బావి మీద రెండు మండుతున్న రూపాలు కనిపిస్తాయని చెబుతారు.

'ఎస్టోనియా సహజ మంత్రశక్తి నిండిన ప్రదేశం. దానిని వివరించడం/వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ జరిగే విషాయాలు చాలా వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి అని అక్కడ నివసిస్తున్న 37 సంవత్సరాల Mari-Liis Roos అంటారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మంత్రాల బావి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి