తీరం ముగ్గులు...(సీరియల్) (PART-1)
“నీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?”
“ఎక్కువ సంపాదించాలి!”
“బ్రహ్మాండం!”
“ఉండండి! నేను ఎక్కువ సంపాదించాలని చెప్పింది డబ్బు మాత్రమే కాదు! అభిమానం సంపాదించాలి! మంచి బంధుత్వాలను సంపాదించాలి! మెప్పులు సంపాదించాలి! అన్నిటినీ కలిపితే మనుషులను సంపాదించాలి!”
“అందుకు నువ్వు కష్టపడనే అక్కర్లేదు. నీ దగ్గర మంచి మనసుంటే, అన్నీ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి!”
“లేదు. దాన్ని నేను నమ్మను! సరైన పక్క బలం లేకపోతే డబ్బు కూడా కొన్ని సంధర్భాలలో నా లాగా వికలాంగమైపోతుంది”
“కోపగించుకోకండి! ఒక సినిమాలో చెబుతారు! మీరు కూడా చూసుంటారు. రక్త సంబంధంతో వచ్చేదంతా లాభమే! ఏదీ కుడా అప్పు కాదు! అలా కాదు అప్పు అని చెబితే తల్లి పాలకు మీరు చెల్లించాల్సిన జరిమానా ఎంత? దాన్ని తీర్చాలనుకుంటే నా తాళి చాల్తుందా? ”
“మనకు పెళ్ళి అయిన వెంటనే వేరు కాపురం వెళ్ళిపోదాం. ఇల్లు చూడమని చెప్పబోతా!”
“ఇలాంటి ఒక ఉద్దేశం ఉంటే, మనకి పెళ్ళే వద్దు ప్రదీప్. ఆపేయండి!”
నువ్వెందుకు దీన్ని ఎదిరిస్తున్నావు? ప్రతి అమ్మాయి ఇష్టపడి ఎంజాయ్ చేసే నిర్ణయం ఇది!”
“నేను అందరి అమ్మాయలలాగా సరాసరి అమ్మాయిని కాను.నాకు మనసులో స్వీయ విశ్వాసం ఉన్నా కూడా, శరీర పరంగా ఒంటరిగా పనులు చేసుకోవటం కష్టం. నన్ను అర్ధం చేసుకో కలిగిన వారి సహాయం నాకు కావాలి! నా పుట్టింటి నుండి నేను రాబోతున్నాను. మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు! ఒంటరిగా నేను కష్ట పడనా?”
“అందుకని”
“మీ ఇంట్లోనే జీవిస్తే, మీ వాళ్ళు నాకు దొరుకుతారు! ఇది మీకు నచ్చలేదంటే, మా ఇంటల్లుడిగా ఇల్లరికం వచ్చేయండి! ఏది సులభం?”
పెళ్ళి తరువాత తాను భర్త ఇంట్లోనే ఉంటాను, లేదు వేరు కాపురమే పెట్టాలనుకుంటే భర్తను ఇల్లరికం రమ్మని ఆమె ఎందుకు చెప్పింది? భర్త ఏం చేశాడు? వీళ్ళ సమస్య ఎలా తీరింది? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
***************************************************************************************************
PART-1
ప్రదీప్ యొక్క
అతి బలహీనం
అతని గుణమే.
అతను ఏ
పనిని సరిగ్గా
పూర్తి చేయలేడు!
తనకంటే గొప్పగా
నిలబడ్డ మిగిలిన
వాళ్ళను చూసి
ఈర్ష్యతో కాలిపోతాడు.
ఆ ఈర్ష్యా
నిప్పే అతన్ని
పైకి రానివ్వకుండా
మొదటి నుండే
అతన్ని అణిచివేస్తోంది!
ఈ రోజూ, నిన్నా
కాదు! పుట్టిన
దగ్గర నుండి
అతనితో పాటూ
పెరుగుతూ వచ్చిన
స్వభావం ఇది!
ఆ కుటుంబంలో పెద్ద
కొడుకు ప్రదీప్.
అతనికంటే నాలుగు
సంవత్సరాల చిన్నవాడు
అతని తమ్ముడు
దిలీప్! అందంలోనూ, చదువులోనూ, తెలివితేటలలోనూ
దిలీప్ ప్రకాశవంతంగా
కనబడతాడు!
స్నేహంగా ఉన్నప్పుడు
నవ్వుతో, స్వారస్యమైన
మాటలతో మిగతావారిని
తన పక్కకు
లాక్కుంటాడు.
అందువల్ల కన్నవారికే
దిలీప్ అంటే
ఎక్కువ ఇష్టం.
దిలీప్ పుట్టిన
మూడు సంవత్సరాల
తరువాత పుట్టింది
మహతి! ఒకత్తే
ఆడపిల్ల కావటంతో
ఆమంటే అందరికీ
ముద్దే.
ఇది కూడా
ప్రదీప్ కు
నచ్చదు!
చదువుకునే వయసులో
ఇంట్లో వాళ్ళను
చూసి ఈర్ష్య.
స్కూల్లో తోటి
విధ్యార్ధులను
చూస్తే ఈర్ష్య...ఇలా
ఈర్ష్యా మనోభావంతో
ప్రదీప్ పెరగటం
వలన, అతని
ఎదుగుదలలో అడ్డంకులు
రావటం మొదలయ్యింది.
స్కూల్ ఫైనల్
పరీక్షలలో అతి
తక్కువ మార్కులతో
పాసవటం వలన, అతన్ని
కాలేజీలో చేర్చటానికి
అతని తండ్రికి
నాలిక తడారిపోయింది.
అక్కడ కూడా
తోటి విధ్యార్ధులూ, విధ్యార్ధినిలూ
సహజంగా సన్నిహితంగా
ఉండటం చూసి
ప్రదీప్ కడుపు
మండిపోయేది!
ఆడపిల్లలు ఎవరూ ఇతన్ని
వెతుక్కుంటూ రారు...వాళ్ళను
వసపరచుకునే ఎటువంటి
నాజూకూ, వినయమూ
అతనికి లేదు!
‘జిడ్డు
మొహం’ అని
మిగిలినవారు పేరు
పెట్టటంతో వాళ్ళు
ఇతని పక్కకే
రారు!
స్నేహితులు లేరు!
ఒకరు మాత్రం
బాగా సన్నిహితంగా, స్నేహంగా
ఉండేవారు. అతన్ని
కూడా ఏదో
ఒక సంధర్భంలో
కోపంగా మాట్లాడటంతో, అతను
కూడా దూరంగా
వెళ్ళిపోయాడు.
అతను మూడో
సంవత్సరం బి.కామ్
చదివేటప్పుడు, తమ్ముడు
దిలీప్ రాష్ట్రంలోనే
ఎక్కువ మార్కులు
తెచ్చుకోవటంతో
మెడిసన్ లో
సీటు దొరికింది!
కుటుంబమే ఒక
డాక్టర్ ఉద్భవించబోతాడని
కుతూహలంతో పండగ
చేసుకుంది.
ప్రదీప్ మాత్రం
అది జీర్ణించుకోలేకపోయాడు!
కుంగిపోయాడు. తమ్ముడితో
మొహం చూపించి
మాట్లాడలేకపోయాడు.
ఆ ఈర్ష్య
మంట అతన్ని
లోలోపల దహించింది.
బి.కామ్
పరీక్షలలో ఫైలయ్యాడు.
అది అతన్ని
ఇంకా అవమానపరిచింది.
తరువాత ప్రైవేటుగా
పరీక్ష రాసి
పాసయ్యాడు. తరువాతది
ఉద్యోగ సమస్య!
చాలా ముఖాముఖి
ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు.
‘ఎలా
మాట్లాడాలి? ఎలా
అప్రోచ్ అవాలి’ అనే
విషయాలను నేర్చుకోకపోవటం
వలన, ఉద్యోగం
దొరకటం కష్టమై
పోయింది.
ఆ కోపాన్ని
తమ్ముడు, చెల్లి
మీద చూపించటంతో
తండ్రి ఆగ్రహంచాడు.
“ఇలా
చూడు ప్రదీప్!
వాళ్ళిద్దరూ జీవితంలో
ఎలా ముందుకు
రావాలి అని
వాళ్ళ గురించి
మాత్రమే ఆలొచించారు!
అందువలన పైకి
ఎదుగుతున్నారు!
నువ్వు, మిగిలిన
వాళ్ళను తక్కువగా
మాట్లాడటం, కోపగించుకోవటం, ఈర్ష్యతో
కాలిపోతున్న కారణంగా
నువ్వు లోకాన్నే
అర్ధం చేసుకోలేకపోతున్నావు!”
“..........................”
“అవతల
వారి మీద
పగ తీర్చుకోవాలని
నీలో నువ్వే
కొట్టుకునే సమయాన్ని
నీ పెరుగుదలకు
వెళ్ళాల్సిన దారి
గురించి వెచ్చిస్తే!
నువు ఎదుగుతావు.
అవతలివారిలో తప్పులు
కనిబెట్టి నిన్ను
నువ్వు తక్కువ
చేసుకోకు!”
ఇలా పలుసార్లు
తండ్రి, ఎవర్నో
ఉద్దేశించి మాట్లాడుతూ
అతనికి చూచాయగా
చెప్పేవాడు.
ఇప్పుడు ఓర్చుకోలేక
తిన్నగా అతనితోనే
చెప్పేసాడు.
“నన్ను
మీరు అవమాన
పరుస్తున్నారు!
ఒక డాక్టర్
ఈ ఇంట్లో
ఉద్భవిస్తున్నాడన్న
కారణంగా, నేను
మీకు హేలన
అయిపోయాను. కన్నవారు
కూడా ఈ
కాలంలో డబ్బులు
తీసుకువచ్చే పిల్లలంటేనే
ఇష్టపడుతున్నారు!”
“ఆపరా!
ఏం వాగుతున్నావురా
నువ్వు? వాడికి
ఇంకా చదువే
అవలేదు! నాకు
వాడు లక్షల
లక్షలుగానా డబ్బులు
ఇచ్చాడు?”
“రేపు
ఇస్తాడు కదా?”
“ఇవ్వనీ!
తీసుకుంటాను. నా
కొడుకును పెద్దవాడ్ని
చేసినందుకు నాకు
ఆ హక్కు
ఉంది! నువ్వు
అన్నయ్యే కదా? వాడిస్తే
నువ్వు కూడా తీసుకో!”
“నాకెవరూ
బిచ్చం వేయక్కర్లేదు!”
“సరి
వదిలేయ్!”
“నేను
ఈ ఇంట్లో
ఇక ఉండను!”
“ధారాళంగా
వెళ్ళిపో! భుజాల
వరకు ఎదిగిన
కొడుకు స్నేహితుడు.
వెళ్ళొద్దని చెప్పటానికి
నేను రెడీగా
లేను!”
తల్లి కలవరపడింది.
“ఏం
మాట్లాడుతున్నారు
మీరు?”
“ఆపవే!
కన్న తండ్రి
దగ్గర మాట్లాడుతున్నట్టా
మాట్లాడుతున్నాడు? బెదిరిస్తున్నాడా
వాడు? దారాళంగా
వెళ్ళనీయవే! వీడి
ఈర్ష్య, ఇన్ఫిరియారిటీ
కాంప్లెక్స్ గురించి
తెలిసి మనం
ఎంత సర్దుకుపోతున్నాం? అరే, కన్నవారిని
మనల్ని వదిలేయ్!
వీడి తరువాత
పుట్టిన ఇద్దరుపిల్లలూ
వీడి వలన
అనుభవిస్తున్న
మనోవేదన అంతా
ఇంతా కాదు!
ఎన్ని రోజులు
వీడిని అనుసరించుకుని
ఉండగలం? చెప్పవే!”
“అమ్మా!
నేనంటే ఇక్కడ ఎవరికీ
ఇష్టం లేదు.
నేను వెళ్తాను!”
“ఎందుకు
ఇష్టపడటం లేదో
ఆలొచించావా! మన
దగ్గరున్న తప్పొపులు
ఏమిటని ఆలొచించి
చూడటం ఒక
మనిషికి తెలిసుండాలి!
సరే, ఇంట్లో
మేమందరం విరోధులమే.
బయట ఒక్క
మనిషి కూడా
స్నేహితుడిగా లేడే!
ఎందుకని?”
“ఏమిటండీ!”
“ఉండవే!
ఒకడు తనని తాను
అర్ధం చేసుకోలేకపోతే
మిగిలిన వాళ్ళు
వాడు అర్ధం
చేసుకునేటట్టు
చేయాలి. అవతలి
వాళ్ళు ఒకర్ని
అభినందించాలంటే
అది తానుగా
వెతుక్కుంటూ రాదు!
దానికోసం వాళ్ళు వాళ్ళని తయారు
చేసుకోవాలి. ఈ
ఇంట్లో వాళ్ళు
రక్త సంబంధం
కొసం వాడికి
తలవొగ్గి పోవచ్చు.
బయటవాళ్ళు అలా
చేస్తారా? చెప్పవే!
చదివి ముగించాడు!
ఉద్యోగం లేదు!
ఎక్కడికి పోతాడు? ఆ
ధైర్యం ఉంటే
చేయనీ! నేను
అడ్డుకోను”
ఆయన బయటకు
వెళ్ళిపోయారు.
అమ్మ దగ్గరకు
వచ్చింది.
“ఇదిగో
చూడు ప్రదీప్!
కోపంతోనూ, ఈర్ష్యతోనూ
ఈ లోకంలో
ఏదీ సాధించటం
కుదరదు!”
“ఆపమ్మా!
నువ్వూ వాళ్ళ
వైపే!”
“ఏమిట్రా
మాట్లాడుతున్నావు
నువ్వు?”
“ఎవరితోనూ
మాట్లాడటం ఇష్టంగా
లేదు...నాకు!” -- అరిచేసి
లోపలకు వెళ్ళిపోయాడు.
తల్లి ఒక
నిట్టూర్పు విడిచింది.
బయట ఒక
కుక్క కూడా
తనని గౌరవించదని
ప్రదీప్ కు
బాగా తెలుసు.
ఇంటి నుండి
వెళ్ళలేదు!
చదువు ముగించి ఒక సంవత్సరం అయినా ఉద్యోగం
దొరకక పోవటంతో
కుంగిపోయిన ప్రదీప్
-- ఇంట్లో ప్రతి
రోజూ దేనికో
ఒకదానికి గొడవ తీసుకువచ్చి కుటుంబాన్ని
గందరగోళంలో పడేసాడు -- తండ్రి
ఎలాగో ఒకలాగా
రెకమండేషన్ పట్టుకుని, ఒక
ప్రైవేట్ కంపెనీలో
పన్నెండు వేల
రూపాయల జీతాంతో
ఉద్యోగం ఇప్పించారు.
“ఇలా
చూడు ప్రదీప్! నీ
కొసం,
ఈ ఉద్యోగాన్ని
పట్టుకోవటం కోసం
నేను చెప్పులు
అరిగేలాగా తిరిగాను.
ఈ ఉద్యోగాన్ని
జాగ్రత్తగా ఉంచుకోకపోతే
నీ వ్యవహారంలో
ఇక మీదట
నేను తలదూర్చను!”
ప్రదీప్, ఉద్యోగంలో
చేరాడు.
‘పుట్టుకతో
వచ్చిన ఈర్ష్యా
గుణం పోతుందా?’
కొత్తగా చేరిన
చోట మొదట
ఎవరితోనూ మాట్లాడలేదు!
కొంతమంది తాముగా
ముందుకు వచ్చి
ఇతనితో స్నేహం
చేయటం మొదలుపెట్టారు!
పనులను ఎలా
చేయాలో అతనికి
నేర్పించారు.
అతనికి మెదడు
కూడా కర్పూరంలాగా
పనిచేయదు! నేర్చుకోవటంలో
ఆలస్యం. దానివలన
ఏర్పడిన చికాకుతో ఎప్పుడూ విసుగుతో కనబడేవాడు!
ఎలాగో ఒక
నెల రోజులు
గడిపి మొదటి
నెల జీతాన్ని
పూర్తిగా తీసుకు
వచ్చాడు. తన
ఖర్చులకు రెండువేల
రూపాయలు ఉంచుకుని
మిగతాది తల్లికి
ఇచ్చాడు.
వాడు బాగుంటే
చాలని అతన్ని
ఏమీ అడగకుండా
వదిలేయటంతో -- తమ్ముడు, చెల్లి
మీద అన్ని
రోజులు అణిచిపెట్టుకున్న
ఉక్రోషం బయటపడటంతో, నేను
సంపాదిస్తున్నాను
అనే గర్వాన్ని
చూపించడం ప్రారంభించాడు!
ఇద్దరూ వాడి
గుణం తెలిసిన
ఇద్దరూ, వాడితో
గొడవ పెట్టుకోకుండా, చాలా సహనంతో
ఉంటారు.
కానీ, ఒక
రోజు చేయి
జారి దిలీప్
తన కళ్లజోడు
విరకొట్టుకున్నాడు.
ప్రదీప్ నోటికొచ్చినట్టు
వాగాడు.
“సారీ
అన్నయ్యా! నేను
కావాలని చేయలేదు” అంటూ క్షమాపణలు
కూడా అడిగాడు
దిలీప్.
అయినా కానీ
ప్రదీప్ కఠినంగా
మాట్లాడటంతో దిలీప్
ఓర్చుకోలేక, సహనం
కోల్పోయి ప్రదీప్
కు సమాధానం
చెప్ప, ప్రదీప్
దిలీప్ ని
కొట్టడానికి చేతులెత్త, దిలీప్
గబుక్కున అన్నయ్య
చేతిని అడ్డుకున్నాడు.
“తమ్ముడుగా
ఉన్నా కూడా
నోటి మాటలతో
ఆపుకో! చెయ్యి
ఎత్తేవా నీ
మర్యాద చెడిపోతుంది.
నన్ను నాన్న
చదివిస్తున్నారు.
నీ డబ్బుల్లో
చిల్లి గవ్వ
కూడా నేను
ఖర్చు పెట్టటంలేదు!
అయినా కూడా
అన్నయ్య అనే
గౌరవంతో, తప్పు నా దగ్గర లేకపోయినా నీకు సారీ
చెప్పాను. మమ్మల్ని
నువ్వు ‘టార్చర్’ చేయటానికీ
ఒక హద్దు
ఉంది!”
మహతి, దిలీప్
తో కలిసింది.
తల్లి, తండ్రి
సమాధాన పరచటానికి
ప్రయత్నిస్తుంటే, ప్రదీప్
ఇంకా ఎక్కువగా
మాట్లాడాడు.
తండ్రికి కోపం
ఎక్కువయ్యింది.
“ఇలా
చూడు ప్రదీప్! నిన్ను చదివించి, నీకొక
ఉద్యోగం ఇప్పించేసాను!
ఇక నీ
బ్రతుకు నువ్వు
బ్రతుకు! ఆ
రోజు నువ్వు
వెళ్తున్నప్పుడే
నేను నిన్ను
ఆపలేదు! కానీ, నువ్వు
వెళ్ళలేదు! ఇప్పుడు
నేనే చెబుతున్నాను.
నువ్వు ఈ
ఇంట్లోంచి బయటకు
వెళ్ళిపో!”
“ఏమండీ!”
“ఏమిటే? నీకు
వీడే కావాలంటే, నువ్వు
వాడితో కలిసి
వెళ్ళిపో! నా
చిన్న పిల్లలిద్దరూ
ప్రశాంతంగా జీవించాలి!
సహనం యొక్క
సరిహద్దు ఇదే.
అర్ధమవుతోందా?”
“నేను
వెళ్ళదా బోతాను!” అన్నాడు ప్రదీప్.
తరువాత నాలుగైదు
రోజులలో తెలిసిన
వాళ్ళ దగ్గర
చెప్పి ఒక
‘మ్యాన్షన్’ లో
అద్దెకు ఒక
గది పట్టుకున్నాడు.
తన పెట్టెలు
తీసుకున్నాడు.
“ఇంటికి
పెద్దవాడిని ఇంట్లోంచి
బయటకు వెళ్ళిపోతున్నాను.
దీని కొసం
కుటుంబమంతా కలిసి
బాధ పడబోతారు!”
“నువ్వు
ఇంట్లో ఉన్నప్పుడు
పడ్డ బాధ
కంటే, ఇకమీదట
ఇంకా ఎక్కువగానా
బాధ పడబోతాము!
ఖచ్చితంగా అసలు
బాధే పడము!
పోరా!”
ప్రదీప్ ఆవేశంగా
మెట్లు దిగాడు.
Continued....PART-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి