కళ్ళల్లో ఒక వెన్నల....(సీరియల్) (PART-11)
మధ్యాహ్నం భోజనంలో
చేయి పెట్టిన
సమయం, వైష్ణవీని
ఫోను పిలిచింది.
మేనకా విసుక్కుంది.
“ఛీఛీ!
ఇదొకటి...ఎప్పుడు
చూడూ మోగుతూనే
ఉంటుంది. వైషూ!
భోజనంలో చెయ్యి
పెట్టిన తరువాత
లేవకు. నేను
తీసుకు వస్తాను”
“త్వరగా
తీసుకురా...కట్
అయిపోతుంది”
“అయితే
అవనీ...వదులు.
నువ్వు సెలవు
పెట్టటమే ఒక
పెద్ద ఆశ్చర్యం.
సెలవు రోజైనా
ఒక గుప్పెడు
భోజనం ప్రశాంతంగా
తినగలుగుతున్నావా?” అంటూనే
తరుముతున్న ఫోనును
తీసి కూతురికి
ఇచ్చింది.
“హలో”
“వైష్ణవీ
సిస్టరే కదా?”
“అవును...చెప్పు
గాయిత్రీ”
“సిస్టర్!
స్వేతా అనే
పేషంట్ ఉంది
కదా...”
“అవును!
ఏమయ్యింది? ఏదైనా
సమస్యా?”
“లేదు.
ఆమె దగ్గర
ఏదో విచారణ
చేయాలని ఆ
ఇన్స్పెక్టర్...” -- గాయిత్రీ
మాట్లాడుతున్నప్పుడే
ఫోన్ చేతులు
మారింది.
“గాయత్రీ?”
“వైష్ణవీ!
నేను ఇన్స్పెక్టర్
అశ్విన్” అన్న స్వరంతో
నరాలు జివ్వుమన్నాయి.
మనసు తుళ్ళిపడింది.
“సార్!
మీ...రా?”
“వైష్ణవీ!
కొంచం ఆసుపత్రి
వరకు రాగలరా?”
“ఏమిటి
సార్...ఏదైనా
సమస్యా?”
“అవును!
మీరొస్తే కొంత
బాగుంటుంది. ఆ
అమ్మాయి నన్ను
చూస్తేనే భయపడుతోంది”
“స్వేతానా?”
“అవును...ఆమె
దగ్గర కొంచం
విచారణ చేయాలి.
కానీ, ఏదడిగినా
భయపడుతోంది, బెదిరిపోతోంది”
“దేని
గురించి సార్
విచారణ?”
“ఆమె
పెళ్ళి గురించి... నాగరాజ్ గురించి”
“అది
నేనే మొత్తం
చెప్పాను కదా?”
“లేదు.
నాకు దానికంటే
చాలా వివరాలు
కావాలి. ఏదైనా
ఆధారాలు కావాలి.
అప్పుడే...”
“సార్...ఒక్క
నిమిషం!”
“ఏమిటి?”
“మీరు
మాట్లాడేది చూస్తే...అతన్ని
కనిబెట్టాసారా? ఎవరు
సార్? ఇప్పుడు
మీతో ఉన్నాడా?”
“లేదు.
ఇంట్లో బంధించి
ఉంచాను”
“ఏమిటీ?”
“మనకి
భయం అక్కర్లేదు
వైష్ణవీ. మీరొస్తేనే
ఈ కేసులో
మనం ముందుకు
వెళ్ళగలం”
“ఇదిగో
బయలుదేరుతున్నా.
ఒక్క పది
నిమిషాల్లో అక్కడుంటాను.
పెట్టేస్తాను” -- అంటూనే
ఫోన్ కట్
చేసి, పరిగెత్తుకు
వెళ్ళి చేతులు
కడుక్కుంది.
“ఏయ్
వైషూ! ఏం
చేస్తున్నావు?”
“అమ్మా!
స్వేతా భర్త
దొరికినట్లు తెలుస్తున్నది.
అశ్విన్ సార్
ఇప్పుడే ఫోన్
చేసారు!”
“అది
ఎవరే?”
“అదే...ఆ
రోజు మురళీ
చెప్పాడే”
“ఎవరు!
పోలీసతనా? అతనెందుకే
నీకు ఫోన్
చేస్తున్నాడు?”
“అమ్మా!
ఎందుకు కంగారు
పడతావు? ఆసుపత్రికి
వెళ్ళొచ్చి అంతా
వివరంగా చెబుతాను.
బై...మ్మా” -- గబగబమని
తన హ్యాండ్
బ్యాగును తీసుకుని
బయలుదేరింది.
“హూ!
ఏం ఉద్యోగం
ఇది? ఇలా
తినకుండా పరిగెత్తితే
ఆరొగ్యం పాడైపోతుంది.
మొదట ఈ
ఉద్యోగం మానేయ్” -- తల్లి
మాటలు గాలిలో
కలిసినై.
అంతలో మైన్
రోడ్డుకు వచ్చేసింది.
బస్సుకోసం కాచుకుంటే
టైము అయిపోతుంది
అని డిసైడ్ చేసుకుని
రోడ్డు మీద
ఖాలీగా వెడుతున్న
ఆటోను ఆపి, అందులో
ఎక్కింది వైష్ణవీ.
ఆమె మనసు
బాగా కంగారుపడింది.
‘అతను
ఎవరై ఉంటాడు? ఫోటో
ఇచ్చిన కాసేపట్లోనే
కనిబెట్టేసారే!
మురళీ చెప్పినట్టు
ఈయన బాగా
తెలివిగల వ్యక్తే.
ఎలాగైతే ఏం, స్వేతాకి
జీవితం తిరిగి
దొరికితే చాలు.
అతన్ని గనుక
నేరుగా కలిస్తే, నాలుగు
మాటలు బాగా
అడగాలి. ఆడవాళ్లంటే
ఆడుకునే వస్తువులు
అనుకుంటున్నాడా? కుదిరితే
అశ్విన్ తో
చెప్పి, నాలుగు
లాఠీ దెబ్బలు
వేయమని చెప్పాలి.
అప్పుడే భయం
అనేది ఉంటుంది.
ఇంకోసారి ఆమెను
వదిలేసి పారిపోదాం
అనుకోడు. ఒక
వేల...
స్వేతా చెప్పినట్టు
వాడికి ఇంకో
పెళ్ళి జరిగుంటే...?’
“అమ్మగారూ!
ఆసుపత్రి వచ్చింది” -- ఆటో
అతను చెప్పగా
ఆలొచనల నుండి
బయటకు వచ్చింది.
డబ్బులు ఇచ్చేసి, గాలివానంత
వేగంతో స్వేతా
ఉన్న వార్డు
వైపు నడవ...ఆమె
బెడ్ దగ్గర
నిలబడి ఏదో
అడుగుతున్నాడు
అశ్విన్.
ఆయసపడుతూ లోపలకు
వెళ్ళింది. “ఎక్స్
క్యూజ్ మి
సార్”
“హలో...రండి
వైష్ణవీ. సారీ!
మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను”
“లేదు...లేదు.
స్వేతా విషయంలో
మంచి జరిగితే
నాకు అదే
చాలు. చెప్పండి
సార్...అతన్ని
కనిబెట్టేసారా?”
“దగ్గర
దగ్గర”
“అలాగంటే?”
“మీరిచ్చిన
ఫోటో, చెప్పిన
గుర్తులు అన్నీ
పెట్టుకుని ఒకడ్ని
పట్టుకుని ఉంచాను.
కానీ...పేరు
మాత్రం తేడాగా
కనబడుతోంది”
“ఏమిటి
సార్?”
“నేను
పట్టుకున్న అతని
పేరు నాగరాజ్
కాదు”
“మరి?”
“అతని
పేరు... ప్రతాప్”
“ఏమిటీ? ప్రతాపా...” అన్న ఆమె, కొంచం
కంగారు పడి
అతని మొహంలోకి
చూసి అడిగింది.
“అది...మీ...తమ్ముడు”
“అవును” మౌనంగా తల
ఊపాడు.
“అలాగా!
ఇది...ఎలా? నేను
నమ్మలేకపోతున్నా”
“నేను
కూడా నమ్మలేకపోతున్నా!
ఈ అమ్మాయితో
నాలుగు నెలలు
కాపురం చేసాడు.
కానీ, మా
ఇంట్లో ఎవరికీ
అనుమానం రాలేదు.
ఎప్పుడూ లాగా
వస్తాడు...వెళ్తాడు.
సగం రోజులు
‘నైట్
డ్యూటీ’ అని
చెబుతాడు. ‘ఐ.టీ’ లో
పనిచేస్తునందువలన
వాడి మీద
మా కుటుంబంలోని
వారు అనుమాన
పడలేదు. అది
వాడికి చాలా
సౌకర్యం అయిపోయింది.
ప్చ్! అమ్మా-నాన్నా
కుంగిపోయారు”
బాధపడుతున్న మొహంతో
చెప్పినతన్ని చూసి
బెడ్ మీద
పడుకున్న స్వేతా
మరింత భయపడింది.
‘ఎమిటీ...ఈయన
తమ్ముడా అతను? పేరుకూడా
మార్చి చెప్పాడా? ఎంత
వెర్రిబాగులదానిగా
ఉండిపోయాను.
“ఇప్పుడు
మీ తమ్ముడు
ఏం చెబుతున్నాడు?”
“ఏమిటేమిటో
చెబుతున్నాడు. ఈ
ఫోటోనే నిజం
కాదు అంటున్నాడు.
ఆమెను మోసం
చేసేననడానికీ--పెళ్ళి
చేసుకున్నాననడానికీ
ఏమిటి సాక్ష్యం? అని
అడుగుతున్నాడు...”
“సాక్ష్యం...సాక్ష్యానికి
ఇప్పుడు ఏం
చేయాలి?” -- వైష్ణవీ
అయోమయంలో పడగా, స్వేతా
వైపు తిరిగాడు.
“ఏమ్మా!
అతన్ని నమ్మి
వెళ్లేవే! రిజిస్టర్
-- ఆఫీసులోనైనా పెళ్ళి
చేసుకుందామని చెప్పుండాలి?”
“చెప్పాను
సార్! ఆయనే, అన్నయ్యను
ఇంట్లో పెట్టుకుని
ఇలా పెళ్ళి
చేసుకుంటే...మర్యాద
పోతుందని చెప్పారు”
“అతను
చెబితే నువ్వు
ఓకే అని
చెప్పేయటమేనా? ఏ
నమ్మకంతో వాడి
వెనుక వెళ్లావు? మీరు
పెళ్ళి చేసుకున్నందుకు
కూడా సాక్ష్యం
లేదే! ఇప్పుడెలా
మిమ్మల్ని కలిపేది?”
“సార్!
స్వేతా తానుగా
వెళ్ళి మీ
అమ్మా...నాన్న
దగ్గర చెబితే?” -- వైష్ణవీ
ఆతృతగా అడగగా...‘వేస్ట్’ అన్నట్టు
తల ఊపాడు.
“నేను
కూడా అదే
ఆలొచనకి వచ్చాను.
కానీ, ఈ
అమ్మాయి బెడ్
మీద నుండి
లేవకూడదని
డాక్టర్ స్ట్రిక్టుగా
చెప్పిందే”
“అవును.
ఆమె ఆరొగ్య
పరిస్థితి అలా
ఉంది. ఏం
సార్? అతన్నే
ఇక్కడికి పిలుచుకు
వస్తే ఏం?”
“ఏమిటి
వైష్ణవీ మీరు? ఇక్కడ
ఎంతో మంది
పేషంట్లు ఉన్నారు.
వాళ్ళ ముందు
కోర్టులో విచారణ
చేసినట్టు విచారించ
మంటారా? అది
స్వేతాకి కూడా
ఇబ్బందిగానే ఉంటుంది.
మా కన్నవాళ్లకు
బాధగా ఉంటుంది.
అంతే కాదు.
అమ్మా-నాన్నలను
నమ్మించటానికి
నేను సాక్ష్యం
అడగటంలేదు. నేనేం
తప్పు చేయలేదని
మొరాయిస్తున్న
వాడి గుట్టును
రట్టు చేయాలనే
నేను కష్ట
పడుతున్నా.
ఖచ్చితంగా ఏదైనా
ఒక ‘క్లూ’ వదిలిపెట్టుండాడు.
అది మాత్రం
దొరికితే చాలు.
స్వేతా! బాగా
ఆలోచించి చూడండి.
మీ పెళ్ళి
జరగటాన్ని ఎవరైనా
కళ్ళారా చూసారా? అంటే...ఆ
గుడిలో ఉన్న
పూజారి...లేదు...ఇంకెవరైనా...ప్లీజ్!
కొంచం ఆలొచించి
చూడండి”
“లేదు
సార్! అదొక
చాలా చిన్న
గుడి. రోడ్డు
పక్కగా ఉన్న
వినాయకుడి గుడి.
మేళ తాళాలూ, అక్షింతలూ, బంధు-మిత్రులూ
ఏదీ లేకుండానే
పెళ్ళి జరిగింది.
ఆ పెళ్ళికి
ఆ వినాయకుడే
సాక్షి” --కన్నీటితో
స్వేతా చెప్పగా, ఎందుకనో
వైష్ణవీ మొహం
వికసించింది.
“ఏయ్
స్వేతా! మర్చిపోయావా? నీ
పెళ్ళికి అతని
ఫ్రెండు ఒకతను
నిలబడ్డారని చెప్పావే?”
“అరే!
అవును నర్సమ్మా!
సార్! ఒకరే
ఒకరు ఉన్నారు
సార్. ఆయనే
ఈ పసుపుతాడును
కొనుక్కొచ్చారు” అన్న వెంటనే
ఉత్సాహపడ్డాడు
అశ్విన్.
“అలాగా? వాడి
పేరేమిటో తెలుసా?”
“పేరు...ఏం
సార్? ఈయన
పేరే నిజం
కాదు! అతని
ఫ్రెండు పేరు
మాత్రం నిజమై
ఉంటుందా?”
“ఉండచ్చు.
ఎందుకంటే...ఎంత
తెలివిగా ఒక
నేరాన్ని చేసినా, ఎలాగూ
కొన్ని తప్పులు
ఉంటాయి. చెప్పు...అతని
పేరేమిటి?”
“రాధా
అని పిలిచారు
సార్. కానీ
పూర్తి పేరు
తెలియదు”
“రా…ధా...” -- ఆలొచనతో
ముఖం వికసించింది.
“ఈ
పేరును ఈ
మధ్యే విన్నాను.
ఎక్కడ...ఎవరు
చెప్పారు?” నెత్తి
మీద వేళ్ళతో
గోక్కున్నాడు.
‘ఈ
ఫోటోను నా
స్నేహితుడు రాధాతో
బీచ్ లో
తీసిందీ’
-- ప్రతాప్ చెప్పింది
చటుక్కున గుర్తుకు
వచ్చింది.
“అవును...అతను
వాడి స్నేహితుడే”
“సార్”
“వైష్ణవీ!
ఇది చాలు.
ఈ రాధా
మాత్రం దొరికితే
చాలు. అన్ని
సమస్యలూ మంచిగా
పరిష్కారమైపోతాయి”
“సార్!
ఆ రాధాను
ఎలా సార్
కనిబెడతారు?”
“అదేమంత
శ్రమ కాదు.
ప్రతాప్ సెల్
ఫోనులో వాడి
నెంబర్ ఉంటుంది.
వాడి సెల్
నుండే ఫోన్
చేసి, వాడిని
మా ఇంటికి
రప్పించ గలను”
“కానీ, ఈ
లోపే మీ
తమ్ముడు చెప్పేసేరంటే?”
“నో
ఛాన్స్! ప్రతాప్
ని ఇప్పుడు
నా గదిలోనే
ఉంచి బంధించాను. నా
గదిలో ల్యాండ్
లైను లేదు.
సెల్ ఫోను
ఖచ్చితంగా వాడి
గదిలోనే ఉంటుంది.
వాడు వేసుకున్న
చొక్కాలోనో, ప్యాంటులోనో లేక
వాడి గదిలో
మరెక్కడైనా పెట్టుంటాడు”
“అయితే
వెంటనే బయలుదేరండి
సార్”
“బయలుదేరుదాం...మనిద్దరం”
“నేను
కూడానా...నేనెందుకు?” -- తడబడ్డది
వైష్ణవీ.
“ప్లీజ్
వైష్ణవీ. ఇది
కాదని చెప్పే
సమయం కాదు.
స్వేతాని మీకు
నాలుగైదు నెలలుగా
తెలుసు. ఆమె
ఎన్ని కష్టాలు
అనుభవించిందో అర్ధమైయుంటుంది.
ఇప్పుడు ఆమె
ఆరోగ్య పరిస్థితి
మీకు తెలుసు.
అందువలన ఆమె
గురించి నేను
చెప్పటం కంటే, ఆమె
తరఫున మీరు
మాట్లాడితే బాగుంటుంది.
నా మాటలకంటే
కూడా, స్వేతాని
చూసుకుంటున్న ఒక
నర్స్ యొక్క
మాటలను మా
ఇంట్లో అందరూ
నమ్ముతారు.
ముఖ్యంగా, మా
తమ్ముడు ఆడుతున్న
నాటకానికి తెరవేయటానికి
మీరు వచ్చే
తీరాలి. ప్లీజ్!
నా కోసం
కాకపోయినా, మీ
పేషంటు కోసం...ప్లీజ్
వైష్ణవీ” -- అతని
ప్రాధేయతను తిరస్కరించలేక
చూపులను తిప్పుకుంది.
స్వేతా యొక్క
శొకమైన ముఖం, దాంట్లో
కనబడ్డ చింత
మనసును కాల్చ, అయిష్టంగానే
సమ్మతించింది. “వెళ్దాం”
అశ్విన్ ముఖం
వికసించింది. ‘థ్యాంక్యూ
సో మచ్.
ప్లీజ్ కమ్’ అని
నడవసాగాడు. మనసులో
ఏర్పడ్డ కలతతో
అతని వెనుక
నడిచింది.
వేగంగా కిందకు
వచ్చిన అతను
తన బైకు
దగ్గరకు వెళ్ళినప్పుడు
ఏదో జ్ఞాపకం
వచ్చిన వాడిలాగా, వైష్ణవీని
ఆసుపత్రి బయటకు
తీసుకు వచ్చి
ఆటో ఎక్కించాడు.
“వైష్ణవీ!
మీరు ఆటోలో
వెళ్ళండి...నేను
నా బండిలో
వస్తాను” అన్నప్పుడు, వైష్ణవీ
మనసులో అశ్విన్
పైన ఆమె
ఉంచిన నమ్మకం, గౌరవం
మరింత ఎత్తుకు
ఎదిగింది. తృప్తిగా
నవ్వింది.
ఇద్దరూ ఇల్లు
చేరుకున్నప్పుడు, ఒక
మోటార్ సైకిల్
మీద వచ్చి
దిగాడు ఒక
యువకుడు. అశ్విన్
ను చూసిన
వెంటనే అతని
దగ్గరకు వచ్చాడు.
“హలో!
అన్నా...ఎలా
ఉన్నారు?”
“బాగున్నాను.
మీరెవరో...తెలియటంలేదే” ఆలోచిస్తూ
బండి ఆపి
కిందకు దిగాడు.
“నేను
రాధాను. ప్రతాప్
స్నేహితుడ్ని”
“ఓ!
రాధా అంటే మీరేనా? మిమ్మల్నే
వెతుకుతున్నాం
-- రండి...రండి” అంటూనే వైష్ణవీని
చూసాడు.
“ప్రతాప్
రెడీ అయ్యాడా
అన్నా? ఫోను
చేస్తే తీయటం
లేదు”
“వాడు
కొంచం ‘బిజీ’ గా
ఉన్నాడు! అవును, ఎక్కడికి
వెళ్ళబోతున్నారు?”
“ఏంటన్నా
అలా అడుగుతున్నారు!
ఈ రోజు
వాడు పెళ్ళి
చూపులకు వెళ్తున్నారు
కదా...దానికి
నన్ను తోడు
రమ్మన్నాడు. అందుకే
వచ్చాను”
“ఓహో!
వాడికి అమ్మాయలను
చూడటం...పెళ్ళి
చేయటం...ఇదంతా
మీ పనేనా?” -- అశ్విన్
కఠినమైన స్వరంతో
అడుగగా, రాధా
ముఖం మారింది.
Continued...PART-12
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి