భవిష్యత్ లో
అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్ (ఆసక్తి)
స్టెమ్ సెల్స్ =
మూలకణాలు.
పాడైపోయిన (
వ్యాధికి గురైన లేక బాగుచేయలేని) అవయవాలతో బాధపడే వారిని, అవయవ మార్పిడి వలన మాత్రమే బ్రతికించగలమని వైద్యశాస్త్రం
ప్రచారం చేస్తున్నప్పటి నుండి అవయవ దానాలు చేసే వారి సంఖ్య కనీసంగా పెరిగిందనేది
నిజం. అవయవ దానాలిచ్చిన వారి అవయవాలను అమర్చుకుని చావు నుంచి బయటపడి ఆనందంగా
జీవితం కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు.
అలాగే మూలకణాలతో అనారొగ్యానికి చెక్ పెట్టవచ్చునని వైద్యశాస్త్రం తెలియజేయడంతో
మూలకణాలను బద్రపరుచుకునే వారి సంఖ్య మరియూ మూలకణాలను దానం చేసేవారి
సంఖ్య కూడా పెరుగుతోంది. అవయవ మార్పడికంటే మూలకణాలతో చేసే వైద్యమే
ఖచ్చితమైన విజయాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేయడంతో మూలకణాలు
బద్రపరిచే బ్యాంకులు కూడా ఎక్కువవుతున్నాయి.
మానవ శరీరం కణాల నిర్మితం. కణాలతో ఏర్పడిన కణజాలం వివిధ శరీర అవయవాలుగా రూపాంతరం చెందుతుంది. అయితే శరీర కణాలన్నీ మూలకణాలు కావు. రెండు నిర్ధిష్ట లక్షణాలున్న జీవకణాలను మాత్రమే మూలకణాలంటారు. వీటికి ఉన్న విశిష్టత ఏమిటంటే శరీరంలోని వేర్వేరు కణాలుగా (చరమ, ఎముక, కండరం తదితరాలు) మారగల సామర్ధ్యం ఈ కణాలకు ఉంటుంది. సమస్యాత్మక కణం అవయవాలుగా, కణజాలాల అభివృద్దికి మూలం ఈ మూల కణాలు. అసాధారణ పరిస్థితుల్లో లేదా ఏదైనా అవయవం లేదా కణజాలం పనిచేయని స్థితి ఏర్పడినప్పుడు మూలకణాలు ఆయా రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సంధర్భాల్లో అవయవాన్ని పూర్తిగా తయారుచేస్తాయి.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
భవిష్యత్ లో అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్....(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి